మీ కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటా

by  |
మీ కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటా
X

దిశ ప్రతినిధి, మెదక్:
మీకు సేవ చేసే అదృష్టం కల్పిస్తే మీ వేన్నంటే ఉండి మీ కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కత్తి కార్తీక అన్నారు. దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దుబ్బాకలో సింహం గుర్తుకు ఓటేసి నూతన రాజకీయ శకానికి నాంది పలకాలని కోరారు. బహుజన అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. తనకు మద్దతు నిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఒక మహిళగా దుబ్బాక ఉప ఎన్నికల్లో మీ ముందుకొస్తున్నాననీ, తనకు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.

Next Story

Most Viewed