రఘురామ కృష్ణంరాజు మనిషి కాదు : నాగేశ్వరరావు

44

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అసలు మనిషే కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పెద్ద అవినీతిపరుడంటూ గతంలో ఆయన గుప్పించిన విమర్శలపై ఆయన స్పందిస్తూ, రఘురామ కృష్ణరాజు ఒక తేడా మనిషి అన్నారు. ఆయనను తాను కనీసం ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో తనపై బురద చల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు బంధువులు వందల కోట్ల విలువైన అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఒక అధికారి ఆత్మహత్య కూడా చేసుకున్నారని కూడా ఆరోపించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..