‘రాజావిక్రమార్క’ అప్‌డేట్ : ఫుల్ ఖుష్‌లో యంగ్ హీరో ఫ్యాన్స్‌

by  |
‘రాజావిక్రమార్క’ అప్‌డేట్ : ఫుల్ ఖుష్‌లో యంగ్ హీరో ఫ్యాన్స్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ కల్ట్ మూవీ ‘ఆర్‌ఎక్స్100’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ.. అప్‌కమింగ్ ఫిల్మ్ అప్‌డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ చిత్ర టీజర్‌ను నవంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో లాంచ్ అయిన ‘రాజా విక్రమార్క’ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ఇందులో కార్తికేయ ఇంటెలిజెన్స్ స్పై‌గా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా సాయి శ్రీపల్లి దర్శకత్వంలో 88 రామా రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.

Next Story