తన సినిమా పేరు వాడుకున్న యంగ్ హీరోపై చిరు కామెంట్స్

by  |
తన సినిమా పేరు వాడుకున్న యంగ్ హీరోపై చిరు కామెంట్స్
X

దిశ, సినిమా : ‘ఆర్ఎక్స్ 100’తో యంగ్ హీరో కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కేవలం హీరో రోల్స్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు విలన్ పాత్రలకు సైతం సై అంటున్న విషయం తెలిసిందే. అయితే కార్తికేయ తాజాగా నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా యంగ్ హీరో ప్రేక్షకులతో పలు విషయాలను పంచుకున్నాడు.

ఈ సినిమాలో ఎన్ఐఏ ఏజెంట్‌గా స్టైలిష్‌గా కనిపిస్తారని కార్తికేయ అన్నాడు. అంతేకాకుండా ట్రైలర్ విడుదలయ్యాక తన కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలైనట్లు తెలిపాడు. కథ విన్నప్పుడు నచ్చినా.. తెరపై ఎలా ఉంటుందోననే డౌట్ ఉండేదని, అయితే ఒక్కో షెడ్యూల్ కంప్లీట్ అవుతుంటే మూవీపై నమ్మకం పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ గురించి ప్రస్తావిస్తూ.. టైటిల్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని పెట్టినట్లు చెప్పాడు. ఈ విషయం మెగాస్టార్‌కు చెబితే ‘గుడ్ లక్’ అన్నారని తెలిపాడు.

Next Story

Most Viewed