కార్తీక మాసం విశిష్టత

by  |
కార్తీక మాసం విశిష్టత
X

దిశ,వెబ్ డెస్క్:
తెలుగు నెలల్లో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఆ కైలాస వాసునికి అత్యంత ప్రీతి కరమైన నెల ఇది. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే చాలా ఆరోగ్య ప్రదమైన మాసం ఇది. ప్రధానంగా ఈ మాసంలో సోమవారం ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజం చేస్తారు. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇక చాలా ఫల ప్రదమైన నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.

ప్రతి ఏడాదీ దీపావళి పర్వదినం ముగియగానే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో భక్తులు పరమశివుని నామస్మరణ చేస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పరమ శివునికి ప్రీతి పాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్టతో చేపట్టే నోములకూ ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఈ మాసంలో పాడ్యమీ, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో ఆ శివ పార్వతుల అనుగ్రహం కోసం తెల్లవారు జామునే మహిళలు పూజలు చేస్తారు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో రోజూ అలా చేయలేని వారు కనీసం ద్వాదశీ, పూర్ణిమ, సోమవారాల్లో లేదా కనీసం ఒక పూర్ణిమా రోజైనా నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యఫలాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పారు.

ఇక కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. దీంతో పాటు ఇహలోకంలో సర్వసౌఖ్యలు కలుగుతాయి. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో దీపారాధన చేస్తే గత జన్మ పాపాలు పూర్తిగా తొలిగిపోతాయి. ఈ జన్మలో ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు దీపారాధన చేయడం వల్ల సౌభాగ్యాలు కలుగుతాయి. మనిషిలోని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారధన ప్రధాన ఉద్దేశ్యం…


Next Story

Most Viewed