10 రోజుల్లో సినిమా కంప్లీట్.. మరి రెమ్యునరేషన్?

by  |
10 రోజుల్లో సినిమా కంప్లీట్.. మరి రెమ్యునరేషన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రజెంట్ జనరేషన్ హీరోస్‌లో స్పెషల్ అనిపించుకుంటున్నాడు. వెరైటీ మూవీస్ ప్లాన్ చేస్తూ యూత్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అయిన ఈ హీరో.. తాజాగా బీటౌన్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. రామ్ మాధ్వానీ డైరెక్షన్‌లో వస్తున్న ‘ధమాకా’లో న్యూ అవతార్‌లో కనిపించబోతున్న ఆర్యన్.. పది రోజుల్లోనే సినిమా పూర్తి చేసేశాడు. కానీ ఇంతకు మించిన న్యూస్ మరొకటి ఉంది. టెన్ డేస్‌లో చిత్రీకరణ పూర్తి చేయడం ద్వారా ప్రొడ్యూసర్స్‌కు చాలా రకాలుగా బెనిఫిట్ ఇచ్చిన కార్తీక్‌.. ఈ చిత్రం కోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. అంటే ఒక్కో రోజుకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న మాట. నార్మల్ బడ్జెట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు దాదాపు 45 రోజులు తీసుకుంటున్న సమయంలో.. ఆర్యన్ వన్ బై ఫోర్త్ టైమ్‌లో ప్రాజెక్ట్ పూర్తి చేసి, నిర్మాతలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చూసుకున్నాడు. దీంతో పోలీస్తే కార్తీక్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ తక్కువే అంటున్నారు విశ్లేషకులు.

ముంబైలోని సబర్బన్ హోటల్‌లో ‘ధమాకా’ షూటింగ్ జరగ్గా.. ఫస్ట్ లుక్‌లో ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు కార్తీక్ ఆర్యన్. మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ చేస్తున్న ఈ సినిమా.. ‘నీర్జా’, ‘ఆర్య(సిరీస్)’ల తర్వాత దర్శకుడు రామ్ మాధ్వానీ నుంచి వచ్చే మరో షాకింగ్ స్టోరీ అవుతుందని బీటౌన్ టాక్. ఇక ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలను లైన్‌లో పెట్టాడు కార్తీక్.



Next Story

Most Viewed