అభిమానికి ఫ్రాంక్ కాల్ చేసిన హీరో.. వీడియో వైరల్

by  |
అభిమానికి ఫ్రాంక్ కాల్ చేసిన హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ అప్ కమింగ్ మూవీ ‘షాహ్‌జాదా’. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తనను చూసేందుకు వచ్చిన అమ్మాయిలను షూటింగ్ స్పాట్‌లో కలిసిన హీరో.. ఓ కాలేజ్ అమ్మాయిని ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు పిక్చర్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ‘షాహ్‌జాదా’ రీమేక్ కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ పుణేలోని ఓ కాలేజ్‌లో జరుగుతోంది.

ఈ క్రమంలో హీరోను చూడటానికి కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఓ అమ్మాయితో సరదాగా మాట్లాడిన హీరో.. ఆమె ఫ్రెండ్‌కు తన ఫోన్ నుంచి ఫ్రాంక్ కాల్ చేసి ‘యష్‌ని మాట్లాడుతున్న.. కార్తీక్ ఆర్యన్ ఎక్కడ?’ అని ప్రశ్నించాడు. అయితే మొదట ఆశ్చర్య పోయినప్పటికీ.. హీరో గొంతు గుర్తుపట్టిన ఆ అమ్మాయి ‘మీరు కార్తీక్ ఆర్యన్’ అని చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా పెద్దగా నవ్వేశారు. ఈ సందర్భంగా హీరోతో సెల్ఫీలు తీసుకున్నారు.

Next Story

Most Viewed