బచ్చన్ సాబ్ చాలెంజ్.. బకరా అయిన ఆర్యన్‌

by  |
బచ్చన్ సాబ్ చాలెంజ్.. బకరా అయిన ఆర్యన్‌
X

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ చిత్రం శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బీ, ఆయుష్మాన్.. బాలీవుడ్ స్టార్స్‌కు టంగ్ ట్విస్టర్ చాలెంజ్ విసిరారు. ఆ వీడియోను సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ క్రమంలో ఈ చాలెంజ్‌కు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ను నామినేట్ చేశాడు బచ్చన్ సాబ్.

చాలెంజ్ స్వీకరించిన కార్తీక్ ఆర్యన్.. టంగ్ ట్విస్టర్ చేస్తూ వీడియో తీస్తుండగా ‘ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్ కార్తీక్ అని మమ్మీ అడిగితే.. నన్ను అమితాబ్ బచ్చన్ సార్ ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. అందుకే చేస్తున్నా’ అని చెప్పాడు. అందుకు కార్తిక్ వాళ్ల అమ్మ.. అమితాబ్ నిన్ను నామినేట్ చేశాడా? ఆయనకు అంత చెడ్డ రోజులు వచ్చాయా ఏంటి? అని అడుగుతుంది. కనీసం సోదరి అయినా నమ్ముతుంది అనుకుంటే.. వెంటనే నవ్వేసి ‘నేను లూడో ఆడుకోవాలి మొబైల్ ఇచ్చేయ్’ అని లాక్కెళ్తుంది.

దీంతో చేసేదేమీ లేక ఇదే వీడియో పోస్ట్ చేసిన కార్తీక్ ఆర్యన్.. ‘ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఉంది’ అని క్యాప్షన్ పెట్టాడు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘గులాబో సితాబో’ టంగ్ ట్విస్టర్ చాలెంజ్‌లో బెస్ట్ వీడియో ఇదే అని నవ్వుకుంటున్నారు. కాగా, ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నా అని వరుణ్ ధావన్ చెప్తే.. అమ్మ లాక్‌డౌన్ స్టార్ అన్నాడు అర్జున్ కపూర్.

Next Story

Most Viewed