- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మరోసారి ‘కార్తికేయ’గా హీరో నిఖిల్..
దిశ, హైదరాబాద్ :
హ్యాపీడేస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్ తెలుగుచిత్రపరిశ్రమలో అందరికీ సుపరిచితుడయ్యాడు. కానీ, ఆ సినిమా హీరో నిఖిల్ కంటే డైరక్టర్ శేఖర్ కమ్ములకే క్రేజ్ దక్కేలా చేసింది.ఆ తర్వాత హీరో నిఖిల్‌కు కెరీర్ పరంగా స్వామిరారా ఒక ఫ్లాట్ ఫాంను సెట్ చేస్తే కార్తికేయ మూవీ హీరోగా మనోడి సత్తాను చాటింది.ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరమీదకు వచ్చిందంటే.. ఏడేళ్ల కిందట వచ్చిన కార్తికేయ చిత్రానికి దర్శకుడు చందు మొండేటి సీక్వెల్ ప్లాన్ చేశారు.అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీశరవేగంగా జరుగుతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. అతి త్వరలోనే మూవీ షూటింగ్ కూడా మొదలు కానుంది. కాగా, ఆదివారం కార్తికేయ-2కు సినిమాకు చెందిన అఫీషియల్ కాన్సెప్ట్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.అయితే ఆ మధ్య కార్తికేయకు సీక్వెల్ ప్రకటించినపుడే చిత్రయూనిట్‌తో దర్శకుడు చందూ, హిరో నిఖిల్ పళని కార్తికేయ స్వామిని దర్శించుకున్నారు.
తొలి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో పార్ట్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే డైరక్టర్ చందూ మొండేటి గత సినిమా ‘సవ్యసాచి’ పెట్టుకున్నఅంచనాలను అందుకోకపోవడంతో కార్తికేయ సీక్వెల్ ఆయనకు కీలకంగా మారింది.మరోవైపు నిఖిల్ ఈ మధ్యే అర్జున్ సురవరం సినిమా హిట్‌తో జోరుమీదున్నాడు. ఇప్పటికే కార్తికేయ-2 వీడియా విడుదల కాగా పలువురి మంచి స్పందన వస్తుందని టాక్. మరోసారి ఆలయ రహస్యాలను చూపించడానికి కార్తికేయ టీం రెడీగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క బహుబలి సీక్వెల్ మినహా వచ్చినా ఏ తెలుగు సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు లేవు. చూద్దాం..ఈ సినిమా నిఖిల్ అండ్ టీంకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో..