ఆనందంతో పొంగిపోతున్న వంటలక్క

by  |
ఆనందంతో పొంగిపోతున్న వంటలక్క
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ తెలియని వాళ్లుండరు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతూ… అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అందులో ప్రధాన పాత్ర చేస్తున్న వంటలక్క గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆమె నటన ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదుడుపే. గత రెండేళ్లుగా ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయిందంటే, ఏకంగా ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ఐపీఎల్‌తో పోటీపడింది. అంతేగాకుండా ఇప్పటికీ ఈ సీరియల్ తెలుగులో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సీరియల్‌లో వంటలక్క పాత్ర చేస్తున్న దీప మంచి క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఈమె నటనకు ఆకర్షితులైన అభిమానులు మహానటి సావిత్రితో పోలుస్తున్నారు. మరికొంతమంది బుల్లితెర సావిత్రి అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో వంటలక్క ఆనందంతో ఉబ్బితబ్బవుతుంది. మహానటితో తనను పోల్చడంపై వంటలక్క స్పందిస్తూ… ఆమె నటనలో కొంచెం చేసినా.. నా జన్మ ధన్యమంటోంది. తనను మహానటితో పోల్చిన అభిమానులకు ధన్యవాదాలు అని తెలియజేసింది.


Next Story

Most Viewed