కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత..

8

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలో కరోనా వ్యాప్తి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో వైరస్ బారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో పాటు మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరగుతూనే ఉంది. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు (65) కన్నుమూశారు.

సెప్టెంబర్ 1వ తేదీన కరోనా సోకడంతో ఆయన బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈయన బీదర్ జిల్లాలోని బసవకళ్యాణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.