ఈటల గెలిచేనా?.. TRS గెలుపు కోసం బరిలోకి కీలక నేతలు..

186
TRS MLA Sathish

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల ఇంచార్జ్ వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సింగపూర్ గ్రామంలో కరీంనగర్ మేయర్, హుజురాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ సునీల్ రావు అధ్యక్షతన కౌన్సిలర్లు, సర్పంచ్‌లు ఎంపీటీసీలతో విడి విడిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 13న హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. మండలంలోని కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..