హెల్త్‌కేర్ వర్కర్స్‌కు కరీనా గిఫ్ట్..

by  |
హెల్త్‌కేర్ వర్కర్స్‌కు కరీనా గిఫ్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్:

కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సుల సేవలు, వారి త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొవిడ్ 19 నుంచి ప్రజలను కాపాడేందుకు.. వారి ప్రాణాలను, కుటుంబ సభ్యుల జీవితాలను ఫణంగా పెట్టి మరీ సేవలందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మహమ్మారిని పారద్రోలేందుకు 24 గంటలు పని చేస్తూనే ఉన్నారు. అది కూడా చాలా కఠిన పరిస్థితుల్లో పీపీఈ కిట్లు ధరించి, కనీసం శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకుండా రోజంతా ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

అలాంటి వైద్య సిబ్బందికి కృతజ్ఞతాభావంతో యాంటీ మైక్రోబయాల్ టీ షర్ట్స్, మాస్క్‌లు అందించింది కరీనా కపూర్ ఖాన్. మీ నిస్వార్థత, అవిశ్రాంత కృషికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్న కరీనా.. మీకు థాంక్స్ చెప్పుకునేందుకు మా నుంచి పంపిస్తున్న వీటిని దయచేసి స్వీకరించాలని కోరింది. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్, బెంగుళూరులోని సక్ర వరల్డ్ హాస్పిటల్‌కు టీషర్ట్స్, మాస్క్‌లు పంపించింది.

ఫ్రంట్ లైన్ వర్కర్స్ తమను తాము కరోనా నుంచి రక్షించుకునేందుకు పీపీఈ కిట్లు ధరించడం అనివార్యమని.. కానీ భారీ లేయర్‌తో ఉన్న పీపీఈ కిట్లను అన్ని గంటల పాటు ధరించడం చాలా కష్టమని.. తను పంపించే యాంటీ మైక్రోబయాల్ టీ షర్ట్స్ ధరించి పీపీఈ కిట్స్ వేసుకోవడం సులభంగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు టీషర్ట్స్ వేసుకోవడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుందని, చెమట, దుర్వాసన ప్రభావాలను నియంత్రించడానికి సహాయపడుతుందన్నారు.

https://www.instagram.com/p/CEtAE4DpPVA/?igshid=u9o4kgga16dm



Next Story

Most Viewed