బీచ్‌లో కరీనా బికినీ పోజు.. యోగా డే స్పెషల్!

by  |
Kareena Kapoor Khan
X

దిశ, సినిమా : ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు తాము యోగా చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ తారలు తమ యోగా ప్రాక్టీస్ పిక్స్‌తో ఫ్యాన్స్‌ను మోటివేట్ చేస్తుండగా.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో త్రో బ్యాక్ పిక్చర్ పోస్ట్ చేసిన కరీనా అభిమానులకు యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ యోగసనాన్ని పాటించి మనసును తేలికపరుచుకోవాలని తన ఫాలోవర్స్‌కు సూచించింది. ఈ ఫొటోలో బికినీ ధరించి, బీచ్‌లో వృక్షాషనం వేస్తూ కనిపించిన కరీనా.. ‘ఫ్రీ యువర్ మైండ్’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. నిజానికి యోగా చేయడాన్ని ఇష్టపడే తను, ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ వివిధ రకాల యోగాసనాలు ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సారా అలీఖాన్ సైతం తన యోగా పిక్‌ను షేర్ చేస్తూ.. ‘మనలో మనకు అంతర్ముఖ ప్రయాణమే యోగా. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే’ అని పోస్టు చేసింది.

Next Story

Most Viewed