సుశాంత్ సూసైడ్.. కరణ్ డిప్రెషన్!

by Jakkula Samataha |

<p>డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను డిప్రెషన్‌లోకి నెట్టిందని తెలుస్తోంది. సుశాంత్ సూసైడ్‌తో నెపోటిజం గురించి పెద్ద చర్చే జరగ్గా.. కంగనా రనౌత్ లాంటి వారు కరణ్‌ను ఓ రేంజ్‌లో విమర్శించారు. బంధు ప్రీతి కేరాఫ్ అడ్రస్.. కరణ్ అని, ఆయన వల్లే ఔట్‌సైడర్స్ ఎదగడం లేదని.. ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు. కేవలం స్టార్స్ వారసులకు మాత్రమే స్టార్ రేంజ్ దక్కాలన్న మనస్థత్వం ఉన్న [&hellip;]</p>

సుశాంత్ సూసైడ్.. కరణ్ డిప్రెషన్!
X

డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను డిప్రెషన్‌లోకి నెట్టిందని తెలుస్తోంది. సుశాంత్ సూసైడ్‌తో నెపోటిజం గురించి పెద్ద చర్చే జరగ్గా.. కంగనా రనౌత్ లాంటి వారు కరణ్‌ను ఓ రేంజ్‌లో విమర్శించారు. బంధు ప్రీతి కేరాఫ్ అడ్రస్.. కరణ్ అని, ఆయన వల్లే ఔట్‌సైడర్స్ ఎదగడం లేదని.. ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు. కేవలం స్టార్స్ వారసులకు మాత్రమే స్టార్ రేంజ్ దక్కాలన్న మనస్థత్వం ఉన్న వ్యక్తి కరణ్ అని విమర్శించారు.

సుశాంత్ మరణంతో ఆవేదనకు గురైన అభిమానులు సైతం కరణ్ పట్ల తీవ్ర ఆగ్రహించారు. కరణ్ బాలీవుడ్‌‌ను గుప్పిట్లో పెట్టుకున్నాడని.. తన వల్లే అవకాశాలు కోల్పోయిన సుశాంత్ చనిపోయాడని.. కాబట్టి కరణ్ ఇద్దరు పిల్లలను కూడా చంపేస్తామని హెచ్చరించారు.

కానీ కరణ్ వీటిపై స్పందించలేదు. సెలబ్రిటీలను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసి తన ఇంట్లో తాను ఉండిపోయాడు. కనీసం ఎవరితో మాట్లాడేందుకు కూడా కరణ్ ఇష్టపడడం లేదని టాక్. ఈ విషయాన్ని తన స్నేహితులు మీడియాతో వివరించారు. సుశాంత్ అభిమానులు, ఔట్‌సైడర్స్ చేసిన విమర్శలతో కుంగిపోయాడని.. చాలా సార్లు ఏడ్చాడని చెప్పారు. తను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని.. బయటకొచ్చేందుకు చాలా టైమ్ పడుతుందని వెల్లడించారు.

Next Story