కరణం బలరాం, ఆమంచి వర్గీయుల ఘర్షణ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువర్గాల్లో గొడవలు సర్వ సాధారణమయ్యాయి. శనివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో కరణం బలరాం పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా&#8230; అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తన నివాసంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆమంచి ఇంటి దగ్గర నుంచి బలరాం పుట్టినరోజు వేడుకల ర్యాలీతో కార్యకర్తలు వెళ్తుండగా&#8230; [&hellip;]</p>

కరణం బలరాం, ఆమంచి వర్గీయుల ఘర్షణ
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువర్గాల్లో గొడవలు సర్వ సాధారణమయ్యాయి. శనివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో కరణం బలరాం పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా… అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తన నివాసంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆమంచి ఇంటి దగ్గర నుంచి బలరాం పుట్టినరోజు వేడుకల ర్యాలీతో కార్యకర్తలు వెళ్తుండగా… ఆమంచి వర్గీయులు వాటర్ బాటిల్స్‌తో దాడి చేశారని కరణం వర్గీయులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొనడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రంగప్రవేశం చేసిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.

Next Story