- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దయచేసి నన్ను ‘పవర్ స్టార్’ అనొద్దు.. ఆ ట్యాగ్ పవన్‌కే సరిపోతుంది'
<p>దిశ, వెబ్‌డెస్క్: “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం.. అలవాటు చేసుకుంటే వదలలేం.. చచ్చేవరకు..” అని పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ మాత్రమే కాదు పవన్ ఫ్యాన్స్ అందరి మాట అదే. పవన్ కళ్యాణ్ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంటుంది.. ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పేరు విన్నా ఆ సౌండ్ కి పూనకాలు వచ్చేస్తాయి. పవర్ స్టార్ అనే బిరుదుకు పవన్ పూర్తిగా అర్హుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం.. అలవాటు చేసుకుంటే వదలలేం.. చచ్చేవరకు..” అని పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ మాత్రమే కాదు పవన్ ఫ్యాన్స్ అందరి మాట అదే. పవన్ కళ్యాణ్ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంటుంది.. ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పేరు విన్నా ఆ సౌండ్ కి పూనకాలు వచ్చేస్తాయి. పవర్ స్టార్ అనే బిరుదుకు పవన్ పూర్తిగా అర్హుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు స్టార్లు నిర్మొహమాటంగా మీడియా ముందే చెప్పారు. ఇక తాజాగా అదే విషయాన్ని ఒప్పుకున్నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ నట వారసుడిగా అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్.. తెలుగు ‘ఇడియట్’ సినిమా కన్నడ రీమేక్ తో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత పవర్ ఫుల్ పాత్రలకు పెట్టింది పేరుగా మారిన పునీత్ ని ఆయన అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అదే బిరుదుతో కంటిన్యూ అవుతున్న పునీత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ బిరుదు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
“పవర్ స్టార్ అంటే నేను కాదు.. అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఆ బిరుదు ఆయనకే చెల్లుతుంది. నేను చాలా సార్లు ఆయనను కలిసాను. కలిసిన ప్రతిసారి ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. పవన్ అభిమానుల మనిషి.. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు” అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మాత్రమే పవర్ స్టార్ అని, ఇక మీదట తనను పవర్ స్టార్ అని పిలవొద్దని ఆయన అభిమానులకు చెప్పడం విశేషం. ఇక ఒక కన్నడ స్టార్ హీరో తమ దేవుడు పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా మాట్లాడేసరికి పవన్ ఫ్యాన్స్ పునీత్ రాజ్ కుమార్ ని ఆకాశానికెత్తుస్తున్నారు.






