- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూతులు తిడుతూ.. రౌడీయిజం చేస్తున్నారు: కన్నా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నియంత పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెపుతారని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నేతలు దిగజారి పోయి భూతులు మాట్లాడటం, రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసిన వారిపై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ 7 […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నియంత పరిపాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెపుతారని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నేతలు దిగజారి పోయి భూతులు మాట్లాడటం, రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసిన వారిపై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ 7 సంవత్సరాల పాలనలో అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. దేశ రక్షణ, పారిశ్రామికపరంగా భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
Next Story






