- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది హిందువులది.. అక్కడ క్వారంటైన్ వద్దు: కన్నా
<p>హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఆ లేఖలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరమని, ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అన్నవరం కొండపై ఉన్న హరిహర సదన్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు చేయాలన్నఅధికారుల నిర్ణయంపై ఆయన ఆగ్రహం […]</p>

హిందూ ఆలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఆ లేఖలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరమని, ఎక్కడా స్థలం లేనట్టు కొండపై ఏర్పాట్లు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అన్నవరం కొండపై ఉన్న హరిహర సదన్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు చేయాలన్నఅధికారుల నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందేనని, అక్కడ కల్పించిన వసతులన్నీ హిందువుల కోసం చేసినవేనని గుర్తుచేశారు. ఈ కొండపై నిర్మించిన సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని తెలిపుతూ, క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని సూచించారు.
tags: ap, bjp, ap cs, kanna laxminarayana, letter






