- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనికా వల్ల ఆ దేశ క్రికెటర్లకు కరోనా ముప్పు
<p>బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం లక్నోలో చికిత్స పొందుతున్న ఆమె… లండన్ నుంచి తిరిగొచ్చాక ముంబైలోని ఓ హోటల్ లో ఉంది. అయితే అదే హోటల్ లో… ఆ టైంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం కూడా ఉన్నట్లు సమాచారం. ఇండియా తో వన్డే సిరీస్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆ దేశపు క్రికెటర్లు .. కనికా కపూర్ బస చేసిన గదికి దగ్గర్లోనే వారి రూం ఉన్నట్లు […]</p>

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం లక్నోలో చికిత్స పొందుతున్న ఆమె… లండన్ నుంచి తిరిగొచ్చాక ముంబైలోని ఓ హోటల్ లో ఉంది. అయితే అదే హోటల్ లో… ఆ టైంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం కూడా ఉన్నట్లు సమాచారం. ఇండియా తో వన్డే సిరీస్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆ దేశపు క్రికెటర్లు .. కనికా కపూర్ బస చేసిన గదికి దగ్గర్లోనే వారి రూం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు కనికా ఆ హోటల్ లో చాలా మంది ప్రముఖులను కలిసినట్లు.. ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు .. తనతో ఎవరెవరు కలిశారో నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్ పెరుగుతోంది. కనికా ను కలిసిన అందరినీ క్వారెంటైన్ కు తరలించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే అసలు కనికా కపూర్ కు కరోనా వచ్చిందా ? లేదా? అనే విషయమే అనుమానంగా ఉందంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కరోనా వైరస్ పాజిటివ్ అని ధృవీకరించిన రిపోర్ట్ లో కనికా డిటైల్స్ తప్పుగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పుడు కనికా వయస్సు 41 కాగా … ఆ రిపోర్ట్ లో 28 మాత్రమే ఉందట. అంతే కాదు స్త్రీకి బదులుగా పురుషుడు అని ఉందట డాక్టర్ రిపోర్ట్ లో. దీంతో ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు కుటుంబీకులు.
Tags: Kanika Kapoor, Cricketer, South Africa, Coronavirus, Covid 19






