పైలట్‌గా కంగనా పర్‌ఫెక్ట్

by  |
పైలట్‌గా కంగనా పర్‌ఫెక్ట్
X

కంగనా రనౌత్.. బాలీవుడ్ క్వీన్. తనలోని నటనకు పదును పెడుతూ సినిమా సినిమాకు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ముందుంటుంది. ‘మణికర్ణిక’ సినిమాతో ఝాన్సీ లక్ష్మీ భాయి వీరత్వాన్ని తెరపై ప్రదర్శించిన కంగనా… వెంటనే ‘పంగా’ సినిమాతో కబడ్డీ ప్లేయర్‌గా మెప్పించింది. ఇప్పుడు భారత మహిళలు గర్వపడే మరో సినిమాతో వస్తోంది. తమ స్వార్థాన్ని చూసుకోకుండా, తొలి ప్రాధాన్యత దేశానికే ఇస్తూ… పైలట్‌గా సేవలు అందించిన మహిళల శక్తి గురించి దేశానికి పరిచయం చేసేందుకు ‘తేజస్’ సినిమా చేస్తోంది కంగనా. ఉరి ద సర్జికల్ స్ట్రైక్స్ నిర్మాత రోని స్క్రూవాల నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీతో సర్వేశ్ మెవారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తేజస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల కాగా… ఐఏఎఫ్ యూనిఫామ్‌లో పర్ ఫెక్ట్‌గా సెట్ అయింది కంగనా. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేన్ ఉండగా … యూనిఫాంలో కంగనా పవర్‌ఫుల్‌గా నడిచే పోస్టర్ ఆకట్టుకుంటోంది. మహిళా పైలట్‌గా నటిస్తున్నందుకు గర్వంగా ఉందన్న కంగనా… ఒక మహిళకు ఛాన్స్ ఇస్తే దేశం కోసం ఎంతగా పోరాడుతుంది… ఎలాంటి త్యాగానికి సిద్ధం అవుతుంది అనేది సినిమాలో చూపిస్తామని తెలిపింది. పైలట్‌గా మహిళలు జాతికి చేసిన సేవలను గుర్తించలేదని .. వారి త్యాగాలను సినిమాలో చూపించబోతున్నామన్నారు. ఈ చిత్రం యువతలో దేశభక్తిని పెంపొందించేలా ఉంటుందని తెలిపారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ 2021లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.



Next Story