- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సడక్ 2’పై కంగనా టీమ్ కౌంటర్
<p>ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ‘సడక్ 2’ ట్రైలర్ ఘోరమైన చెత్త రికార్డును సొంతం చేసుకుంది. అలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ట్రైలర్‌కు నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం విషయంలో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మహేష్ భట్, అలియా భట్‌లు.. అంతకు మించిన వ్యతిరేకతను ‘సడక్ 2’ ట్రైలర్ విషయంలో ఎదుర్కొంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తొమ్మిది […]</p>

ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ‘సడక్ 2’ ట్రైలర్ ఘోరమైన చెత్త రికార్డును సొంతం చేసుకుంది. అలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ట్రైలర్‌కు నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం విషయంలో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మహేష్ భట్, అలియా భట్‌లు.. అంతకు మించిన వ్యతిరేకతను ‘సడక్ 2’ ట్రైలర్ విషయంలో ఎదుర్కొంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తొమ్మిది గంటల్లో 1.5 లక్షల లైక్స్ వస్తే.. 26 లక్షల డిస్ లైక్స్ వచ్చాయి. అంతే కాదు ట్రైలర్ కంటెంట్‌పై కూడా వ్యతిరేకత ఏర్పడింది.
ట్రైలర్‌లో అలియా భట్ డైలాగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నకిలీ గురువుల కారణంగా నేను ఒకరిని కోల్పోయాను (గురువో కే వచా సే మైనే కిసీ అప్నే కో ఖోయా హై) అనే డైలాగ్‌పై వ్యతిరేకత వస్తోంది. ‘ఎప్పుడూ హిందూ గురువులను చిన్నగా చేసి చూపించడం కాదు.. దమ్ముంటే గురువుల ప్లేస్‌లో మాల్వి (ముస్లిం గురువు), పాద్రి (పాస్టర్) పదాలను రీప్లేస్ చేసి ట్రైలర్ మళ్లీ రిలీజ్ చేయగలరా’ అని మహేష్ భట్‌ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఈ విషయాన్నే కంగనా టీమ్ కూడా ప్రస్తావించింది. ఈ పక్షపాతాలతో సాధువుల ఉరితీత ఘటనకు ఏదైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. భారత్‌లో మత విద్వేషాలు, పక్షపాతాలను వ్యాప్తి చేసేందుకు పాకిస్తానీ పింప్స్‌ను ఎందుకు అనుమతించారని అడుగుతున్నారు.






