సోనమ్‌పై కంగనా ఫైర్

by  |
సోనమ్‌పై కంగనా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా నిలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి ముంబైలో తన ఆఫీస్ కూల్చివేత వరకు రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం గురించి ఎత్తి చూపుతూ రచ్చ చేస్తూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలంటే గిట్టని కంగనా.. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరిని ఏకిపారేస్తుంది. ఈ క్రమంలో ఈసారి కంగనాతో చివాట్లు తినే వంతు బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు దక్కింది.

సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయింది. ఈ క్రమంలో ప్రపంచం గుడ్డిది అయిపోయిందంటూ సోనమ్ ట్వీట్ చేయడంతో మండిపడింది కంగనా. అకస్మాత్తుగా బాలీవుడ్ మాఫియా జనాలు తన ఆఫీస్ కూల్చివేతను అడ్డంపెట్టుకుని రియాకు సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు ఏంటో అర్ధం కావడం లేదని ఫైర్ అయింది. నా పోరాటం ప్రజల కోసమని..దీన్ని ఒక సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్‌ను కోల్పోయేలా చేసిన ఓ చిన్న డ్రగ్గీతో పోల్చకూడదని వార్నింగ్ ఇచ్చింది. కాగా, తన కార్యాలయం కూల్చివేత విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా సవాల్ విసిరింది కంగనా. ఈ విషయంలో ఆమెపై పోలీసు కేసు నమోదు కాగా, ఇండస్ట్రీ నుంచి మాత్రం మద్దతు పెరిగింది.



Next Story

Most Viewed