'సీత' గా మారిన బాలీవుడ్ క్వీన్.. కరీనాను సైతం పక్కకు నెట్టి

by  |
సీత గా మారిన బాలీవుడ్ క్వీన్.. కరీనాను సైతం పక్కకు నెట్టి
X

దిశ, సినిమా : ‘తలైవి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లుగా ఎపిక్ పిరియాడిక్ డ్రామా ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’లో సీత పాత్రపై చర్చ జరుగుతుండగా.. ఎట్టకేలకు ఆ క్యారెక్టర్ చేయబోయేది బాలీవుడ్ క్వీన్ అని ప్రకటించారు మేకర్స్. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు కె.వి. విజయేంద్ర ప్రసాద్, అలౌకిక్ సంయుక్తంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సీత కోణంలో తెరకెక్కే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కంగన, సీత పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

‘ప్రపంచం విశ్వాసంతో లొంగిపోయిన వారికి సహాయం చేస్తుంది. ఎండమావి అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టత ఉంది. ఎన్నడూ అన్వేషించని ఒక పవిత్రమైన పాత్ర కల ఇప్పుడు సాకారం అయింది. కంగనా రనౌత్‌ని సీతగా తీసుకువచ్చేందుకు సంతోషపడుతున్నాను. ఈ పవిత్రమైన ప్రయాణం మేము మా పురాణాలను ఎలా గ్రహిస్తున్నామో సూచించబోతోంది. మీ అపారమైన మద్దతు, నమ్మకానికి ధన్యవాదాలు’ అని తెలిపారు నిర్మాత సలోని శర్మ.


Next Story

Most Viewed