- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తలైవి’ని మరిపించిన కంగన
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ అగ్రతార కంగనా రనౌత్ తలైవి పాత్రలో నటిస్తోంది. జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా రనౌత్.. జయలలిత గెటప్ స్టిల్స్‌ను తన ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఈ సినిమా కోసం కంగనా ఎంతో కష్టపడ్డారు. జయలలితలా కనిపించేందుకు బరువు పెరిగారు. అలాగే తమిళం నేర్పుకోవడంతోపాటు భరత నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సారధి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ అగ్రతార కంగనా రనౌత్ తలైవి పాత్రలో నటిస్తోంది. జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా రనౌత్.. జయలలిత గెటప్ స్టిల్స్‌ను తన ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఈ సినిమా కోసం కంగనా ఎంతో కష్టపడ్డారు. జయలలితలా కనిపించేందుకు బరువు పెరిగారు. అలాగే తమిళం నేర్పుకోవడంతోపాటు భరత నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది.
విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో అరవింద స్వామి, జయలలిత తల్లిగా భాగ్యశ్రీ, కరుణానిధిగా ప్రకాష్‌రాజ్, జిషు సేన్‌గుప్తా శోభన్‌బాబు పాత్రల్లో నటిస్తున్నారు.







