'తలైవి'కి ట్రిబ్యూట్..వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కంగన

by  |
తలైవికి ట్రిబ్యూట్..వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కంగన
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని స్మరించుకుంటున్నారు తమిళ ప్రజలు. అమ్మ మెమోరియల్ డే 2020 పేరుతో సోషల్ మీడియాలో ఐరన్ లేడీకి నివాళులు అర్పిస్తున్నారు. పలువురు సెలెబ్రిటీలు తనను స్మరించుకుంటూ ట్వీట్ చేయగా.. జయలలిత బయోపిక్ ‘తలైవి – ది రెవల్యూషనరీ లీడర్’లో టైటిల్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్ హార్ట్ ఫెల్ట్ ట్రిబ్యూట్ అందించింది. జయ అమ్మ నాలుగో వర్ధంతిని సందర్భంగా ‘తలైవి’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఎల్ విజయ్ అండ్ టీంకు థాంక్స్ చెప్పిన కంగనా..మరో వారం రోజుల్లో తలైవి షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలిపింది.

గత కొన్ని వారాలుగా హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె.. ఆరుసార్లు తమిళనాడు సీఎంగా ఎన్నికైన స్ట్రాంగ్ ఉమన్ లీడర్ జయ అమ్మ అని, తన పాత్ర చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. అరవింద స్వామి ఎంజీఆర్‌గా కనిపించబోతున్న సినిమాలో ప్రకాశ్ రాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్న చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

https://twitter.com/KanganaTeam/status/1335078803064799233?s=20


Next Story

Most Viewed