- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నచ్చితేనే సినిమా చేస్తా : కంగనా
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. మనసులో ఏమనుకుంటుందో సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తుంది. బాలీవుడ్‌కు ఎంటర్ అయిన టైంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్న బ్యూటీ.. నటనతోనే తనపై కామెంట్ చేసిన వారి నోరు మూయించింది. నాకు నచ్చిందే చేస్తాను మీకేంటి? అన్నట్లు మారిపోయింది. నిజమే కంగనా.. నచ్చిందే చేస్తుంది. నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది. తనకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాను అంగీకరిస్తుంది. లేదంటే ఏ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వచ్చి బతిమాలినా.. మొహం మీదనే నో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. మనసులో ఏమనుకుంటుందో సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తుంది. బాలీవుడ్‌కు ఎంటర్ అయిన టైంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్న బ్యూటీ.. నటనతోనే తనపై కామెంట్ చేసిన వారి నోరు మూయించింది. నాకు నచ్చిందే చేస్తాను మీకేంటి? అన్నట్లు మారిపోయింది. నిజమే కంగనా.. నచ్చిందే చేస్తుంది. నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది. తనకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాను అంగీకరిస్తుంది. లేదంటే ఏ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వచ్చి బతిమాలినా.. మొహం మీదనే నో చెప్పేస్తుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ “సుల్తాన్” సినిమాలో ముందుగా హీరోయిన్‌గా చేయమని కంగనానే సంప్రదించారట. కానీ అనివార్య కారణాల వల్ల చేయలేను అని చెప్పేసిందట. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ చిత్రంలో కంగనాను చేయమని కోరారట దర్శక, నిర్మాతలు. కానీ ప్రాధాన్యత లేదని ఒప్పుకోలేదట. చివరికి హీరో రణ్‌బీర్ కాల్ చేసినా చేయలేనని నిర్మొహమాటంగా చెప్పిందట. ఇలా చాలా సార్లు జరిగిందని… అందుకే బాలీవుడ్‌లో కొంత మందికి తనంటే పడదని టాక్. కరణ్ జోహార్, మహేష్ భట్‌తో గొడవలకు ఇదే కారణమని అంటుంటారు.
Tags : Kangana Ranaut, Bollywood, Sultan, Sanju






