యూత్‌‌ తెలివిలేని కోతుల్లా తయారయ్యారు : కంగన

98

దిశ, సినిమా : ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ గురించి అడిగితే కొంతమంది యువత సమాధానాలు చెప్పలేకపోయింది. ‘ఇండిపెండెన్స్ డే’ను హిందీలో ఏమని పిలుస్తారు? మనదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు?’ లాంటి ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. పైగా తెలుసుకుని మాత్రం ఉపయోగమేంటనే సమాధానమిచ్చారు. ఈ వీడియోపై స్పందించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ యూత్‌ను తెలివిలేని కోతులుగా అభివర్ణించింది. ‘ఈ దేశాన్ని నిర్మించేందుకు ఎంతో మంది త్యాగం చేశారు.. ఇప్పటికీ దేశాన్ని కాపాడుకునేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. నేను కూడా ఇందుకోసం ఎనర్జీ, టైమ్ ఇన్వెస్ట్ చేశాను. కానీ ఇలాంటి ఆదిమ కోతులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ట్వీట్ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..