వాట్ ఏ రొమాంటిక్.. కంగనా, అరవింద స్వామి సాంగ్

by  |
kangana
X

దిశ, సినిమా : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైటిట్ రోల్ పోషిస్తుండగా.. నటుడు అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘తేరే ఆంకో మే’ రొమాంటిక్ సాంగ్‌ టీజర్‌ను వదిలిన మేకర్స్.. తాజాగా ఫుల్ సాంగ్‌ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి గల ఈ పాటలో జయలలిత, ఎంజీఆర్ మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని రీక్రియేట్ చేయడంలో కంగనా, అరవింద్ స్వామి సక్సెస్ అయ్యారు. నిజమైన ప్రేమికులా? అన్నంతగా తమ పాత్రల్లో జీవించేశారు. అంతేకాదు సౌత్ ఇండియన్ సినిమాకు స్వర్ణయుగంగా చెప్పుకునే 60, 70వ దశకాన్ని ఈ సాంగ్ మరోసారి తెరమీద ఆవిష్కరించిందని చెప్పొచ్చు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన పాటను అర్మాన్ మాలిక్, ప్రజక్త శుక్రే ఆలపించగా.. ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించారు.

ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ‘తలైవి’.. గత ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ కావడంతో తమిళ్, తెలుగు, హిందీలో సెప్టెంబర్ 10న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో మధు బాల, భాగ్యశ్రీ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Next Story