ఐదేళ్ల తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న హీరోయిన్!

by  |
ఐదేళ్ల తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న హీరోయిన్!
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నటి కంగనా రనౌత్. పవర్‌ఫుల్ పాత్రల్లో మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసే కంగనా ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా స్వీకరించింది. అయితే అమ్మడు రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఐదేళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యపీగా ఉంటా. ఐదేళ్ల తర్వాత మంచి తల్లిగా, భార్యగా, నవ భారత ఆధునీకరణలో విలువైన పాత్ర పోషించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా’ అని చెప్పింది.

ఇక తనను వరించే ఆ అదృష్టవంతుడు ఎవరనే ప్రశ్నకు.. ‘ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను, మిస్టర్‌ కంగనా రనౌత్‌ ఎవరో త‍్వరలోనే తెలుసుకుంటారు’ అని వెల్లడించింది. దీంతో నెటిజన్లు కంగనాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అంతేకాకుండా మా అంచనా ప్రకారం మీరు పవర్‌ఫుల్ లీడర్‌ను పెళ్లి చేసుకుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు కదా! అని కామెంట్లు చేస్తున్నారు.

బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన బాహుబలి భామ.. నెటిజన్లు ఫిదా


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed