IND vs NZ: బ్లాక్‌క్యాప్స్‌కు న్యూ కెప్టెన్.. టీ20లో కనిపించని కేన్ మామ

by  |
IND vs NZ: బ్లాక్‌క్యాప్స్‌కు న్యూ కెప్టెన్.. టీ20లో కనిపించని కేన్ మామ
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌‌ కోసం తీవ్రంగా శ్రమించిన కీలక ఆటగాళ్లు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇందుకు అంగీకారం తెలుపుతున్నాయి. టీమిండియాకు టీ20 సీరిస్‌ల కోసం నూతన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా.. కోహ్లీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చారు. వాస్తవానికి టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే తరహాలో బ్లాక్‌క్యాప్స్‌ కూడా విలియమ్సన్‌కు రెస్ట్ ఇచ్చింది. న్యూజీలాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా తొలుత మూడు టీ20 మ్యాచులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. టెస్టు మ్యాచ్‌ కోసం విలియమ్సన్‌ దృష్టి సారించిన నేపథ్యంలో రేపటి(నవంబర్ 17) నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో అతడు ఆడటం లేదు. ఇక న్యూజీలాండ్‌ టీ20 కెప్టెన్సీ బాధ్యతలను ఆ జట్టు పేస్ బౌలర్ టీమ్ సౌథీకి అప్పగించారు. ఇదే విషయంపై NZC ఒక ప్రకటనలో తెలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed