- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేన్ విలియమ్సన్‌కు అందమైన పాప
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్-సారా రహీమ్ దంపతులు బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విలియమ్‌సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘అందమైన పాపను నా కుటుంబంలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను’ రాసిన క్యాప్షన్‌తో పాప ఫొటోను పంచుకున్నాడు. కేన్ విలియమ్‌సన్‌కు సహచర క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న విలియమ్‌సన్‌కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎక్కువగా […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్-సారా రహీమ్ దంపతులు బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విలియమ్‌సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘అందమైన పాపను నా కుటుంబంలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను’ రాసిన క్యాప్షన్‌తో పాప ఫొటోను పంచుకున్నాడు. కేన్ విలియమ్‌సన్‌కు సహచర క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న విలియమ్‌సన్‌కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. సన్‌రైజర్స్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయం పోస్ట్ చేయగానే తెలుగు అభిమానులు అతడికి శుభాకంక్షలు తెలిపారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు న్యూజీలాండ్‌లో పర్యటిస్తున్నది. పితృత్వ సెలవుపై రెండో టెస్టుకు విలియమ్‌సన్ లీవ్ పెట్టాడు.
Next Story






