- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమ జంట
by Sridhar Babu |
<p>దిశ, కామేపల్లి: ఈరోజుల్లో ప్రేమించుకోవడం, ఆపై పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన భానోత్ పాండు, ధరావతు రమ్యశ్రీ గత ఆరేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇరువురు ప్రేమ వివాహం చేసుకునేందుకు ఇష్టపడి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఈ పెళ్లిని రమ్యశ్రీ కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీసుల […]</p>

X
దిశ, కామేపల్లి: ఈరోజుల్లో ప్రేమించుకోవడం, ఆపై పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన భానోత్ పాండు, ధరావతు రమ్యశ్రీ గత ఆరేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇరువురు ప్రేమ వివాహం చేసుకునేందుకు ఇష్టపడి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఈ పెళ్లిని రమ్యశ్రీ కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీసుల సాక్షిగా ప్రేమ వివాహం చేసుకున్నారు.
Next Story






