కమలాపూర్ ఓటర్ల సంచలన నిర్ణయం.. ఎలా గెలుస్తాడో చూస్తామంటూ వార్నింగ్

by  |
కమలాపూర్ ఓటర్ల సంచలన నిర్ణయం.. ఎలా గెలుస్తాడో చూస్తామంటూ వార్నింగ్
X

దిశ, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఓటుకు డబ్బులు ఇవ్వడం లేదంటూ పలు వార్డులకు సంబంధించిన ఓటర్లు ఆందోళన నిర్వహించారు. ఓటుకు ఆరువేల రూపాయలు ఇవ్వలేదని మధ్యలో ఉన్న నాయకులే బీజేపీ, టీఆర్ఎస్ అంటూ ఓటర్లను నిర్ణయిస్తూ, కొందరికి మాత్రమే ఓటుకు నోటు పంపిణీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఓటు వేయకుండానే కెసీఆర్ గెలిచాడా? కెసీఆర్ మా పైసలు మాకే ఇస్తున్నాడని, బీజేపీ, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు.

బీజేపీ ప్రచారానికి వెళ్లి, బీజేపీలో కండవ కప్పుకొని మద్ధతు తెలిపినందుకు డబ్బులు ఇవ్వడం లేదని నాయకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా వచ్చిన డబ్బులు అందరికీ ఇచ్చిన విధంగా మాకు ఇవ్వాలని ,కెసీఆర్‌ను మేమేమైనా డబ్బులు ఇవ్వమని అడిగామా? డబ్బులు వచ్చినప్పుడు నాయకులకు సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాలలో వేస్తే బాగుండని, స్థానిక నాయకులు స్థానికేతర ఇన్చార్జిలు ఎలా మమ్మల్ని బీజేపీ, టీఆర్ఎస్ అని గుర్తిస్తారని, మాపై ఏమైనా బీజేపీ అని ఎక్కడైనా రాసి ఉందా? ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. 30 వ తేదీన జరగబోయే ఉప ఎన్నిక ఎన్నికలలో ఓటును వేయబోమని బహిష్కరిస్తామని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed