- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
329 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేత..!
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగలిగిద్ద, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో 329 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మనూరు ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి, మోతీభాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్ద అన్నలా కల్యాణ లక్ష్మి […]</p>

X
దిశ, నారాయణఖేడ్:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగలిగిద్ద, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో 329 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మనూరు ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి, మోతీభాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్ద అన్నలా కల్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నారని తెలిపారు.
Next Story






