- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం 15 రోజుల లాక్ డౌన్…?
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వసంత ఆలయ ఈఓకు లేఖ కూడా రాశారు. సెకండ్ వేవ్ తో గ్రామంలో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్భందం పాటించక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు. కంటైన్ మెంట్ జోన్ గా ఏర్పాటు చేసుకుని స్వీయ నిర్భందం పాటించక తప్పని పరిస్థితి తయారైందని […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వసంత ఆలయ ఈఓకు లేఖ కూడా రాశారు. సెకండ్ వేవ్ తో గ్రామంలో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్భందం పాటించక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు.
కంటైన్ మెంట్ జోన్ గా ఏర్పాటు చేసుకుని స్వీయ నిర్భందం పాటించక తప్పని పరిస్థితి తయారైందని సర్పంచ్ ఆ లేఖలో వివరించారు. ఇప్పటికే గోదావరి తీరంలో పూజలు చేయవద్దని బ్రాహ్మణ సంఘం, నాయి బ్రాహ్మణులు కూడా తమ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఆలయంలో కూడా 15 రోజుల పాటు పూజలు నిలిపివేసి, భక్తుల రాకపోకలు లేకుండా చూడాలని సర్పంచ్ వసంత కోరారు.
Next Story






