‘అయ్యా ముఖ్యమంత్రి గారు’.. మా విన్నపాలు కొంచెం వినండి

by  |
‘అయ్యా ముఖ్యమంత్రి గారు’.. మా విన్నపాలు కొంచెం వినండి
X

దిశ, కేయూ క్యాంపస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేయూ యూనివర్సిటీ లెక్చరర్లు బహిరంగ లేఖ రాశారు. గత పదేళ్లుగా తాము చాలీచాలని జీతాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నామని, గతంలో పలుమార్లు మా సమస్యలను ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు సైతం విన్నవించుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి తోడ్పాటు అందించినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని విద్యార్హతలు ఉన్నా పీరియడ్‌కు 450 రూపాయల చొప్పున నెలకు సుమారు 18 వేలు జీతం మాత్రమే ఇస్తున్నారని.. ఆ డబ్బులు సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.

అయితే, ఇప్పుడు వస్తున్న జీతం కూడా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఇటీవల ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు వేతనాలు పెంచారని, తమపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. కావున, తమ యందు దయతలిచి తాత్కాలిక అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్టు కోరారు. తమ విజ్ఞప్తులను తీర్చాలని లేఖలో పేర్కొన్నారు. దీని ప్రకారం జీఓ నెంబర్141 వెంటనే అమలు చేయాలని, ఫుల్ వర్క్ లోడుతో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్‌ను అప్‌గ్రేడ్ ( కాంట్రాక్టర్ లేదా అకాడమీ కన్సల్టెంట్) చేయాలన్నారు. అదే విధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్‌లో వెయిటేజ్ ఇవ్వాలని, తోటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు 7వ పే కమిషన్ ప్రకారం 30 శాతం వేతనాలు పెంచారు. దానిని తాత్కాలిక అధ్యాపకులకు కూడా వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ దబ్బేట మహేష్, డా.గుగులోత్ దివోజి నాయక్, డా.విజయ్, డా.సోమలింగం, డా.విజయ, డా.టి. సంజీవ, డా.కిరణ్ కుమార్, డా. నివాస్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed