కేంద్రం ఫ్రీగా టీకా ఇవ్వకుంటే.. మేమే అందిస్తాం కేజ్రీవాల్

by  |
కేంద్రం ఫ్రీగా టీకా ఇవ్వకుంటే.. మేమే అందిస్తాం కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇది వరకు కోరినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. టీకాకు డబ్బులు చెల్లించే స్థోమత లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వారందరికీ టీకా అందించాలంటే ఉచితంగా పంపిణీ చేయాలని అభ్యర్థించినట్టు వివరించారు.

ఢిల్లీ వాసులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా అందించకుంటే ఆప్ ప్రభుత్వమే అందిస్తుందని హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉన్నదని అన్నారు. కరోనా టీకాను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వ్యాక్సిన్‌పై అపోహలకు పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పుకార్లు, వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు.


Next Story

Most Viewed