కాబోయే వాడితో కాజల్..

by  |
కాబోయే వాడితో కాజల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్.. తొలిసారి కాబోయే భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ‘గౌతమ్ కిచ్లు’ను హగ్ చేసుకుని నవ్వులు చిందిస్తున్న పిక్ పెట్టింది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిపోయినా సరే.. ఇద్దరు కలిసి క్లారిటీగా ఉన్న పిక్ ఒక్కటి కూడా మీడియాకు దొరకలేదు. కాగా, తాజాగా కాజు ఈ పిక్ షేర్ చేయడంతో ఆ కొరత తీరింది. అక్టోబర్ 30న ముంబైలో వివాహం జరగనుండగా.. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. మరోవైపు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టి మమ్మల్ని మరింత బాధ పెట్టకు కాజు.. అంటున్నారు.

కాగా కాజల్ సరికొత్తగా డిజిటల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంటర్టైన్ చేయబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న సిరీస్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చేస్తుంది. తమిళ్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్న సిరీస్.. మరిన్ని భాషల్లోకి డబ్ అయ్యే చాన్స్ ఉంది.


Next Story

Most Viewed