ప్రెగ్నెన్సీ‌పై కుండ బద్దలు కొట్టిన కాజల్ అగర్వాల్

by  |
ప్రెగ్నెన్సీ‌పై కుండ బద్దలు కొట్టిన కాజల్ అగర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరుతో ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో పలు చిత్రాలకు అగ్రిమెంట్ ఇవ్వగా.. కాజల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఇదే విషయంపై తాజాగా స్పందించిన కాజల్.. తల్లిగా మారడం ఓ అద్భుతమైన అనుభూతి అంటూ చెప్పుకొచ్చింది. ఆ స్టేజ్‌లోనే సెల్ఫ్​రియలైజేషన్​అవుతారంటూ పేర్కొంది. తన చెల్లి(నిషా) కొడుకును ఎత్తుకుంటే తాను అమ్మను అనే ఫీలింగ్ వస్తోందని.. తాను, గౌతమ్.. ఇంట్లో ఉన్న మియా(పెంపుడు కుక్క)కు కూడా తల్లిదండ్రులుగా ఫీలవుతున్నామని చెప్పింది. ప్రెగ్నెంట్ విషయంలో ఇప్పుడు తాను మాట్లాడాలని అనుకోవట్లేదని.. సరైన సమయంలో స్పందిస్తా అంటూ క్లారిటీ ఇచ్చింది.

Next Story

Most Viewed