'డ్యాన్సింగ్ క్వీన్‌'గా కాజల్ అగర్వాల్

by  |
డ్యాన్సింగ్ క్వీన్‌గా కాజల్ అగర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ సినీ ప్రయాణంలో ఎన్నో కీలక పాత్రలు, మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్. అలాంటి కాజల్ కొత్త హీరోయిన్ల రాకతో కాస్త వెనుకబడినా… పంచదార బొమ్మకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. క్రేజీ ఛాన్స్‌తో మరో సారి హవా చూపించబోతోంది. కొరియన్ మూవీ ‘డ్యాన్సింగ్ క్వీన్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు రానా. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కీలకం కాగా… కాజల్‌ను సంప్రదించాడు రానా. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. త్వరలో సినిమా పట్టాలెక్కబోతోంది.

‘డ్యాన్సింగ్ క్వీన్’ రీమేక్‌లో అల్లరి నరేష్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాజల్, నరేష్ కపుల్స్‌గా అలరించబోతున్నారని సమాచారం. అయితే నరేష్ పక్కన చేసేందుకు కాజల్ ఒప్పుకుందంటే కెరియర్ డల్ అయిపోయినట్లేనా అని విమర్శిస్తున్నారు కొందరు. ఐటెం సాంగ్స్‌కు ఓకే చెప్తున్న కాజల్… ఈ సినిమాను ఒప్పుకోవడంలో వింతేమీ లేదంటున్నారు. కానీ పవర్ ఫుల్ పాత్రతో ఎంటర్టైన్ చేయబోతున్న కాజల్‌… ఈ సినిమా తర్వాత బిజీ అయిపోతుందంటున్నారు మరికొందరు. డ్యాన్సింగ్ క్వీన్‌గా కాజల్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags: Kajal Agarwal, Naresh, Rana, Dancing Queen, Korean Film



Next Story

Most Viewed