ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్‌పై ఆటగాళ్ల అసంతృప్తి

by  |

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని విభేదాలు బయటపడుతున్నాయి. ఆస్ట్రేలియా ఓటమికి కోచ్ జస్టిన్ లాంగర్ వ్యూహాలే కారణమని కొందరు సీనియర్ ఆసీస్ క్రికెటర్లు వ్యాఖ్యానించారని.. ఈ విషయంపై జట్టు గ్రూపులుగా విడిపోయినట్లు అక్కడి పత్రికలు కథనాలు రాశాయి. కోచ్ వ్యవహార శైలిపై ఆసీస్ క్రికెటర్లు చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ముగిసిన గబ్బా టెస్టు సందర్భంగా ఒక ఆసీస్ క్రికెటర్ జేబులో శాండ్‌విచ్ పెట్టుకొని మైదానంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడట.

అప్పుడు లాంగర్ గమనించి అతడిని వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా బౌలింగ్ కోచ్ బౌలర్లకు సరైన సలహాలు ఇవ్వట్లేదనే అనుమానం వచ్చి బౌలర్ల సమావేశాలపై లాంగర్ నిఘా పెట్టాడట. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల లాంగర్‌పై ఆటగాళ్లు అసంతృప్తి పెంచుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, మైదానంలోకి జేబిలో శాండ్‌విచ్ పెట్టుకొని వెళ్తే క్రికెటర్ల గురించి తప్పుడు సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందనే అలా వారించినట్లు లాంగర్ చెబుతున్నాడు. మొత్తానికి ఒక్క ఓటమితో జట్టులో చిన్న చిన్న మనస్పర్దలు కూడా పెద్దగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story