- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పీసీఏను ఏర్పాటు చేసింది. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్‌లతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే జస్టిస్ కనగరాజ్ గత ఏడాది ఎస్‌ఈసీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. దీంతో ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని భావించిన సీఎం వైఎస్ జగన్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బాధ్యతలు అప్పగించారు.






