Jr NTR : మొదటి భారతీయుడిగా ఎన్టీఆర్ రికార్డ్..

by Shyam |   (  Updated:2021-08-18 05:07:39  IST  )

<p>దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. లగ్జరీ కారు ‘లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్’ను పొందిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇండియాలో ఈ కారు సోమవారమే అఫీషియల్ గా లాంచ్ కాగా, త్వరలోనే హైదరాబాద్‌లోని తన ఇంటికి డెలివరీ కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగళూరు‌లో ఉన్న కారు డీటెయిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఆటోమొబైల్ స్పేస్ పేజ్ ‘ఆటోమొబిలియార్డెంట్’ పోస్ట్ చేసింది. &#8220;దేశంలో మొట్టమొదటి ‘లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్’ హైదరాబాద్‌లో ఇంటిని కనుగొంది. నీరో నోక్టిస్ మ్యాట్‌లో [&hellip;]</p>

Jr NTR : మొదటి భారతీయుడిగా ఎన్టీఆర్ రికార్డ్..
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. లగ్జరీ కారు ‘లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్’ను పొందిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇండియాలో ఈ కారు సోమవారమే అఫీషియల్ గా లాంచ్ కాగా, త్వరలోనే హైదరాబాద్‌లోని తన ఇంటికి డెలివరీ కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగళూరు‌లో ఉన్న కారు డీటెయిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఆటోమొబైల్ స్పేస్ పేజ్ ‘ఆటోమొబిలియార్డెంట్’ పోస్ట్ చేసింది. “దేశంలో మొట్టమొదటి ‘లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్’ హైదరాబాద్‌లో ఇంటిని కనుగొంది. నీరో నోక్టిస్ మ్యాట్‌లో అరాన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో ఉన్న కారు.. డెలివరీకి ముందు బెంగుళూరులో ఉంది. ఈ కారు హీరో జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీకి చేరుకుంటుంది” అని పోస్ట్ పెట్టింది. దీన్ని ఎన్టీఆర్ పీఆర్ మహేష్ కోనేరు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో రీపోస్ట్ చేశారు. కాగా తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.

Next Story