- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర కేబినెట్ చర్చిస్తున్న 25 అంశాలివే..!
రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయం వేదికగా కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక రంగాల సమగ్ర అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయం వేదికగా కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక రంగాల సమగ్ర అభివృద్ధిపై చర్చిస్తున్నారు. దాదాపు 25కు పైగా ప్రధానమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండో దశ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 3,168 పోస్టుల భర్తీకి ఈ సమావేశంలో పచ్చజెండా ఊపనున్నారు. అంతేకాదు చేనేత కార్మికులను ఆదుకునేలా 'నేతన్న భరోసా' పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నారు. ఈ పథకం ద్వారా 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
వేదుళ్లపల్లి వద్ద దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
అలాగే బాపట్ల జిల్లా వేదుళ్లపల్లి వద్ద వినికిడి లోపం ఉన్న దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించనున్నారు. రాబోయే 'గోదావరి పుష్కరాలు–2027' కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేయడానికి నిర్ణయించారు. అదేవిధంగా అత్యవసర సేవల నాణ్యత పెంచేందుకు అగ్నిమాపక శాఖ ఆధునీకరణపైనా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు.






