గుడ్ న్యూస్.. పాత బంగారంపై ఆఫర్!

by Harish |   (  Updated:2020-06-25 03:45:14  IST  )

<p>దిశ, సెంట్రల్ డెస్క్: ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వినియోగదారులకు భరోసా కల్పించేందుకు ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్ గరిష్ట విలువను చెల్లించి పాత బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు పాత బంగారాన్ని తమకిచ్చి కొత్త బంగారం కొనవచ్చని తెలిపింది. అలా కొనుగోలు చేసిన వారికి తక్షణమే నగదు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్టు జోయ్ అలుక్కాస్ వెల్లడించింది. వినియోగదారులు జోయ్ అలుక్కాస్ వెబ్‌సైట్ [&hellip;]</p>

గుడ్ న్యూస్.. పాత బంగారంపై ఆఫర్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వినియోగదారులకు భరోసా కల్పించేందుకు ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్ గరిష్ట విలువను చెల్లించి పాత బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు పాత బంగారాన్ని తమకిచ్చి కొత్త బంగారం కొనవచ్చని తెలిపింది. అలా కొనుగోలు చేసిన వారికి తక్షణమే నగదు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్టు జోయ్ అలుక్కాస్ వెల్లడించింది. వినియోగదారులు జోయ్ అలుక్కాస్ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో బంగారం కొనొచ్చని, అంతేకాకుండా 10 శాతం చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలుందని పేర్కొంది.

Next Story