జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి : అల్లం నారాయణ

by  |
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి : అల్లం నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లంనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం టీయూడబ్ల్యూజే నాయకులు సీఎం కేసీఆర్‌కు వినతిపత్రాన్ని ఆన్‌లైన్లో పంపారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో అనేక మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తా సేకరణ నిత్య కృత్యమైందని.. విధి నిర్వహణలో పాల్గొంటున్న జర్నలిస్టులందరిని వారియర్స్‌గా గుర్తించాలని కోరారు. వైద్య, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను గుర్తించిన విధంగానే అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వార్తలను సేకరిస్తున్న ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు.

బీహార్, మధ్య ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు జర్నలిస్టులను వారియర్స్‌గా గుర్తించాయని, ఆ గుర్తింపుతోనే కరోనా బారిన పడినా, మృతి చెందిన అధిక ప్రయోజనాలు ఉంటాయని గుర్తు చేశారు. జర్నలిస్టుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ కూడా వారియర్స్‌గా గుర్తించి అన్ని ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమికి ఇచ్చిన వెల్ఫేర్ ఫండ్‌తోనే కరోనా సోకిన వారికి తోడ్పాటు అందజేస్తున్నామని తెలిపారు.

మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టెమ్జ్ అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed