- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘సీఎన్ రావు మృతి తీరని లోటు’’
<p>సీనియర్ ఫోటో జర్నలిస్టు సీఎన్ రావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎన్ రావు గత 40ఏండ్లుగా ఫొటో జర్నలిస్టుగా మీడియా రంగానికి సేవలు అందించారని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పనిచేశారని, తాజాగా ఈనాడు దినపత్రికలో పనిచేశారని తెలిపారు. ప్రజలు తమ హక్కులకోసం చేసిన అనేక […]</p>
సీనియర్ ఫోటో జర్నలిస్టు సీఎన్ రావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎన్ రావు గత 40ఏండ్లుగా ఫొటో జర్నలిస్టుగా మీడియా రంగానికి సేవలు అందించారని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పనిచేశారని, తాజాగా ఈనాడు దినపత్రికలో పనిచేశారని తెలిపారు. ప్రజలు తమ హక్కులకోసం చేసిన అనేక ఉద్యమాలకు ఆయన అండగా నిలిచారని చెప్పారు. అనేక సంఘటనల్లో అద్భుతమైన ఫోటోలు తీసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించారని, ఢిల్లీ కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా సీఎన్ రావు భాగస్వామి అయ్యారన్నారు. ఫోటో జర్నలిజంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటన్నారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.






