డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌పై వేటు

by  |
డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌పై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక జట్టు(Team) విజయం సాధించడంలో బ్యాట్స్‌మెన్(Batsman) సెంచరీ ఎంతో కీలకం. అదే డబుల్ సెంచరీ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ అయినట్టే. అతడికి జట్టులో కూడా మంచి గుర్తింపు(Identity) రావడంతో టాప్ ఆర్డర్‌(Top order)కు వెళ్లేందుకు అర్హత(Eligible) సాధిస్తాడు. కానీ, యువ బ్యాట్స్‌మెన్ జోర్డన్ కాక్స్‌(Young batsmen Jordan Cox)(19) ఓ మ్యాచ్‌లో చెలరేగి 238 పరుగులు తీశాడు. కానీ, అతడు చేసిన చిన్న తప్పిదంతో మరో మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు.

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board) బాబ్ విల్లీస్ ట్రోఫీ(Bob Willis Trophy) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే ట్రోఫీలో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌(English County Cricket) తరఫున ఆడుతున్న జోర్డన్ కాక్స్(Jordan Cox) చేలరేగి 238 పరుగులు చేశాడు. ససెక్స్ టీమ్‌(Sussex Team)పై ఇంత భారీ స్కోర్(High score) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే డబుల్ సెంచరీ చేసి రికార్డు(Record) సృష్టించాడు.

దీంతో అతడి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. ఇదే సంతోషంతో కరోనా నిబంధనల(Corona rules)ను మరిచిన కాక్స్ ఓ అభిమానితో సెల్ఫీ(selfie)దిగాడు. అంతే.. అప్పటివరకు ఆనందంతో ఊగిపోయిన కాక్స్.. టీమ్ యాజమాన్యం వేటు వేయడంతో తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడు. సోషల్ డిస్టెన్సింగ్, అయో సెక్యూర్ నియమాలను ఉల్లంఘించినందుకు అతడని వచ్చే మ్యాచ్‌లో ఆడనివ్వమని టీమ్ యాజమాన్యం స్పష్టం చేసింది.

కరోనా సమయంలో పలు నిబంధనల(Terms)తో మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, పలు నియమాలను జట్టు సభ్యులు తప్పనిసరిగా పాటించాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డు(Cricket Board)లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే జట్టు సభ్యులతో కాకుండా ఇతర వ్యక్తులను(fans) తాకడం వంటివి చేస్తే సెల్ఫ్ ఐసోలేషన్‌(Self Isolation)కి వెళ్లాల్సిందే. దీంతో జోర్డ‌న్ కాక్స్ పై వేటు వేశామని.. ప్రోటోకాల్(Protocol) ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైరెక్ట‌ర్ పౌల్ డౌన్‌టౌన్ (Director Paul Downtown) తెలిపారు. అయితే, కరోనా పరీక్ష(Corona test)ల్లో నెగిటెవ్(Negitev) వస్తే కాక్స్ తిరిగి జట్టులోకి చేరవచ్చునని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed