- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోఫ్రా ఆర్చర్‌కు శస్త్ర చికిత్స.. ఐపీఎల్‌కు దూరం
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కుడి చేతికి అయిన గాయానికి సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు ఈసీబీ వైద్య వర్గాలు తెలిపాయి. ఇండియా పర్యటనకు ముందే గాయపడిన ఆర్చర్.. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డే సిరీస్‌కి ముందు గాయం తిరగబెట్టడంతో టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు నుంచి విడుదల చేసి లండన్ పంపించింది. ఆర్చర్ లండన్ చేరుకున్న వెంటే అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స తప్పనిసరి […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కుడి చేతికి అయిన గాయానికి సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు ఈసీబీ వైద్య వర్గాలు తెలిపాయి. ఇండియా పర్యటనకు ముందే గాయపడిన ఆర్చర్.. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డే సిరీస్‌కి ముందు గాయం తిరగబెట్టడంతో టీమ్ మేనేజ్‌మెంట్ జట్టు నుంచి విడుదల చేసి లండన్ పంపించింది. ఆర్చర్ లండన్ చేరుకున్న వెంటే అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స తప్పనిసరి అని తేల్చారు. కాగా, సోమవారం శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆర్చర్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఈసీబీ వర్గాలు చెప్పాయి. దీంతో ఆర్చర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవుతాడని స్పష్టమయ్యింది.
Next Story






